Home » Stotras » Sri Yajnavalkya Surya Stotram

Sri Yajnavalkya Surya Stotram

శ్రీ యాజ్ఞ  వల్క్య కృతమ్ సూర్య స్తోత్రం

ఓం నమో భగవతే ఆదిత్యాయాఖిలజగతాం ఆత్మస్వరూపేణ కాలస్వరూపేణ
చతుర్విధభూత-నికాయానాం బ్రహ్మాదిస్తమ్భ-పర్యన్తానాం
అన్తర్హృదయేషు బహిరపి చాకాశ ఇవ ఉపాధినాఽవ్యవధీయమానో
భవానేక ఏవ క్షణలవ-నిమేషావయవోపచిత-సంవత్సరగణేన
అపా-మాదాన-విసర్గాభ్యాం ఇమాం లోకయాత్రాం అనువహతి ॥ 1 ॥

యదుహ వావ విబుధర్షభ సవితరదస్తపత్యనుసవనం అహరహః
ఆమ్నాయవిధినా ఉపతిష్ఠమానానాం అఖిల-దురిత-వృజినబీజావభర్జన
భగవతః సమభిధీమహి తపనమణ్డలమ్ ॥ 2 ॥

య ఇహ వావ స్థిరచరనికరాణాం నిజనికేతనానాం మన-ఇన్ద్రియాసుగణాన్
అనాత్మనః స్వయమాత్మా అన్తర్యామీ ప్రచోదయతి ॥ 3 ॥

య ఏవేమం లోకం అతికరాల-వదనాన్ధకార-సంజ్ఞా-జగరగ్రహ-గిలితం
మృతకమివ విచేతనం అవలోక్య అనుకమ్పయా పరమకారుణికః ఈక్షయైవ
ఉత్థాప్య అహరహరను సవనం శ్రేయసి స్వధర్మాఖ్యాత్మా
వస్థానే ప్రవర్తయతి అవనిపతిరివ అసాధూనాం భయముదీరయన్నటతి ॥ 4 ॥

పరిత ఆశాపాలైఃతత్ర తత్ర కమలకోశాఞ్జలిభిః ఉపహృతార్హణః ॥ 5 ॥

అథహ భగవన్ తవ చరణనలినయుగలం త్రిభువనగురు
భిర్వన్దితం అహం అయాతయా మయజుఃకామః ఉపసరామీతి ॥ 6 ॥

ఏవం స్తుతః స భగవాన్ వాజిరూపధరో హరిః ।
యజూంష్యయాతయామాని మునయేఽదాత్ ప్రసాదితః ॥ 7॥

ఇతి శ్రీమద్భాగవతే ద్వాదశస్కన్ధే శ్రీయాజ్ఞవల్క్యకృతం శ్రీ సూర్య స్తోత్రం సంపూర్ణం

ప్రతిరోజూ ఆకాశంలో ఉదయించే సూర్యుడిని మునులు, రుషులు, పండితులు చాలామంది అర్చిస్తుంటారు. వీరేకాక దేవతలు, సిద్ధులు, చారణులులాంటివారు కూడా నిత్యం ఆయన్ను ఆరాధిస్తూనే ఉంటారు. దీనికి కారణం ఏమిటి? అనే విషయం పూర్వం వైశంపాయనుడికి కలిగింది. ఆ సందేహాలను తీరుస్తూ వ్యాసమహర్షి సూర్యభగవానుడి మాహాత్మ్యాన్ని పేర్కొన్న కథాసందర్భం పద్మపురాణంలో మనకు కనిపిస్తుంది.

సూర్యుడు బ్రహ్మస్వరూపం నుంచి ప్రకటితమయ్యాడు. ఆయన బ్రహ్మ తేజోరూపుడు. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రహ్మమే ఆయన. ఆ భగవానుడు ధర్మార్థ కామమోక్షాలనే పురుషార్థాలను తనను అర్చించినవారికి ప్రసాదిస్తాడు. సర్వలోకాల ఉత్పత్తి, పాలన ఈయన రూపంగానే జరుగుతుంటుంది. లోకాలన్నిటికీ రక్షకుడు కూడా సూర్యభగవానుడే. ఈ భగవానుడిని ఆరాధిస్తే దేవతలందరినీ ఆరాధించినట్లే లెక్క. సూర్య మండలంలో ఉన్న సంధ్యాదేవిని ఉపాసించి స్వర్గాన్ని, మోక్షాన్ని ఎందరెందరో పొందుతూ ఉంటారు.

రోగాల నుంచీ విముక్తి :
సూర్యోపాసనవల్ల రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. అంధత్వం, దారిద్య్రం, దుఃఖం అనే వాటి నుంచి తన భక్తులను సూర్యుడు తప్పిస్తుంటాడు. సూర్యభగవానుడు సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడి ప్రతిరూపమే. అందుకే ఆయనకు సూర్యనారాయణుడు అనే పేరు వచ్చింది. ఇంతటి సూర్య భగవానుడికి నిత్యం దోవ చూపిస్తూ ఉంటుంది సూర్యుడి భక్తురాలైన ఉషాసుందరి. ఈమె రాత్రికి అక్క, ఆకాశానికి కూతురు, వరుణదేవుడికి చెల్లెలు. కాంతులను విరజిమ్ముతూ నిత్యం యువతిలా శోభిల్లుతూ ఉంటుంది. ఈ ఉష సకల జంతుజాలానికి చైతన్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈమె ముందుగా చూపించిన మార్గంలో సూర్యభగవానుడు ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఈ జగత్తులో జరిగే సంఘటలన్నీ సూర్యభగవానుడి లీలా విలాసాలే. సూర్యుడిని అంతా ఆరాధించటంలో మరో మహత్తర విషయం కూడా ఉంది. ఆయన ప్రాతఃకాల సమయంలో బ్రహ్మదేవుడిలా ప్రకృతి అంతటా జీవాన్ని నింపుతుంటాడు. మధ్యాహ్న వేళల్లో మహేశ్వరుడిలా తమోగుణ లీలలను ప్రదర్శిస్తుంటాడు. రుద్రుడిలా ప్రకృతి రజోగుణాన్ని శుష్కింపచేస్తుంటాడు. ఇలా దినమంతా ఆ దినకరుడు ప్రకృతికి చేసే మేలు ఇంతా అంతా కాదు.

సూర్యుడు కేవలం ఒక్కడుగా కాక పన్నెండు రూపాలుగా అంటే ద్వాదశాదిత్యులుగా ఉండటం విశేషం. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర అనేవారే ద్వాదశాదిత్యులు. సూర్యభగవానుడు నిజంగా అంత మేలు చేస్తాడు. తనను ఉపాసించినవారికి కొంగుబంగారమై ఆదుకుంటాడు

Sri Vinayaka Stuthi

శ్రీ వినాయక స్తుతి (Sri Vinayaka Stuthi) మూషికవాహన మోదకహస్త చామరకర్ణ విలమ్బితసూత్ర వామనరూప మహేశ్వరపుత్ర విఘ్నవినాయక పాద నమస్తే దేవదేవసుతం దేవం జగద్విఘ్నవినాయకమ్ హస్తిరూపం మహాకాయం సూర్యకోటిసమప్రభమ్ వామనం జటిలం కాన్తం హ్రస్వగ్రీవం మహోదరమ్ ధూమ్రసిన్దూరయుద్గణ్డం వికటం ప్రకటోత్కటమ్ దన్తపాణిం...

Sri Durga Apaduddharaka Stotram

శ్రీ దుర్గా ఆపదుద్ధార స్తోత్రమ్(Sri Durga Apaduddharaka Stotram) నమస్తే శరణ్యే శివేసాను కంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే ! నమస్తే జగద్వంద్య పాదారవిందే నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !! నమస్తే జగచ్చింత్య మానస్వరూపే నమస్తే మహాయెాగి విజ్ఞానరూపే !...

Sri Shyamala Stuti

శ్రీ శ్యామలా స్తుతి (Sri Shyamala Stuti) మాణిక్యవీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసం ఑ మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసాస్మరామి || 1 || చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగాశోణే | పుండ్రీక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే...

Sri Gayathri Devi Ashtakam

శ్రీ గాయత్రీ అష్టకం (Sri Gayatri Ashtakam) సుకల్యాణీం వాణీం సురమునివరైః పూజితపదాం శివ మాద్యాం వంద్యాం త్రిభువన మయీం వేద జననీం పరాం శక్తిం స్రష్టుం వివిధ విధిరూపగుణమయీమ్ భజేంబాం గాయత్రీం పరమమృతమానంద జననీమ్ || 1 || విశుద్ధాం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!