Home » Sri Shiva » Shiva Nindha Stuthi

Shiva Nindha Stuthi

శివ నిందా స్తుతి (Shiva Nindha Stuthi)

ఇసుక రేణువులోన దూరియుందువు నీవు
బ్రహ్మాండమంతయును నిండియుందువు నీవు
చివురాకులాడించు గాలిదేవర నీవు
ఘన కానలను గాల్చు కారుచిచ్చువు నీవు

క్రిమికీటకాదులకు మోక్షమిత్తువు నీవు
కాలయమునిబట్టి కాలదన్ను నీవు
పెండ్లి జేయరాగ మరుని మండించినావు
పెండ్లియాడి సతికి సగమిచ్చినావు

దక్షయాగము ద్రుంచి సురలందరిని గొట్టి
వికటాట్టహాసమున భయపెట్టినావు
కడలి చిలుకు వేళ కాలకూటము బుట్ట
దాని త్రావి సురల గాచినావు

ఈ తిక్క శివునితో వేగలేననుచూ
ముక్కంటి కోపాన్ని ఓపలేననుచూ
వదిలిపోదమన్న వేరు దైవము లేదు
నీవు తప్ప నాకు గతియు లేదు

ఏమిసేతును దేవ సర్దుకొందును లెమ్ము
అమ్మవారి నడిగి మసలుకొందు
దూరముగ నీవున్న నా భయము హెచ్చును
నాదాపు నుండుటకు నీవొప్పుకొనుము

నీ ఆలితో గూడి నాగుండెలోనుండి
ఏడేడు లోకాల నేలుకొనుము
నా ఋణము తీర్చుకొన ఇవ్వుమొక చిరువరము
నా మనము నీ పదము నుండునటుల.

Navaratri Pooja Vidhanam

నవరాత్రి పూజ విధానం (Navaratri Pooja Vidhanam) అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతో పివా యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యా భ్యంతర శ్శుచిః (తలమీద నీళ్ళను చల్లుకోవాలి) గణపతి ప్రార్దన ఓం శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్...

Sri Mahakala Stotram

श्री महाकाल स्तोत्रं (Sri Mahakala Stotram) ॐ महाकाल महाकाय महाकाल जगत्पते महाकाल महायोगिन महाकाल नमोस्तुते महाकाल महादेव महाकाल महा प्रभो महाकाल महारुद्र महाकाल नमोस्तुते महाकाल महाज्ञान महाकाल तमोपहन महाकाल महाकाल...

Sri Thathvarya Stavah

శ్రీ తత్త్వార్యా స్తవః (Sri Thathvarya Stavah) శివకామసున్దరీశం శివగఙ్గాతీరకల్పితనివేశమ్ । శివమాశ్రయే ద్యుకేశం శివమిచ్ఛన్మా వపుష్యభినివేశమ్ ॥ ౧॥ గీర్వాణచక్రవర్తీ గీశ్చేతోమార్గదూరతోవర్తీ । భక్తాశయానువర్తీ భవతు నటేశోఽఖిలామయనివర్తీ ॥ ౨॥ వైయాఘ్రపాదభాగ్యం వైయాఘ్రం చర్మ కంచన వసానమ్ । వైయాకరణఫణీడ్యం...

Siva Kruta Durga Stotram

शिवकृतं दुर्गास्तोत्रम् (Siva Kruta Durga Stotram) श्रीमहादेव उवाच रक्ष रक्ष महादेवि दुर्गे दुर्गतिनाशिनि। मां भक्त मनुरक्तं च शत्रुग्रस्तं कृपामयि॥ विष्णुमाये महाभागे नारायणि सनातनि। ब्रह्मस्वरूपे परमे नित्यानन्दस्वरूपिणी॥ त्वं च ब्रह्मादिदेवानामम्बिके जगदम्बिके।...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!