Home » Samskruthi » Sri Rama Navami Visistatha

Sri Rama Navami Visistatha

శ్రీ రామనవమి విశిష్టత (Sri Rama Navami Visistatha)

వసంత ఋతువు, చైత్ర మాసం, పునర్వసు నక్షత్రం, నవమి తిధి నాడు జన్మించాడు.

వసంతం: “తస్య దేవా వసంత శిరః గ్రీష్మఓ దక్షిణ పక్ష:” అంటుంది వేదం.
సర్వస్య గాత్రస్య శిరః ప్రదానం కాబట్టి అన్ని అవతారాలలో ఇది ముఖ్యమైన, పరిపూర్ణ అవతారం అని చూపించడానికి వసంత ఋతువు.

చైత్ర మాసం: చైత్ర మాసానికి వేదంలో మధు మాసం అని పేరు. అతి మధురమైన రామ నామం, మధురమైన నడవడిక కల్గిన వాడు కాబట్టి చైత్ర (మధు)మాసం.

పునర్వసు: పున అంటే మరల వసు అంటే ఐశ్వర్యం. పేరుకు చక్రవర్తే కానీ ఎవరికి వారు స్వయం ప్రతిపత్తిగా రాజ్యాలను పరిపాలన చేసుకుంటున్న సమయంలో అరణ్యవాసం పేరు మీద అన్ని రాజ్యాలను ఒక్క తాటిపై నిలబెట్టి మళ్ళీ ఐశ్వర్యాన్ని సంపాదించాడు కాబట్టి పునర్వసు.

నవమి:
“ఇక దశ శత సహస్రి లక్షాధిక్యశ్చ గుణ్యమానాపి న జానాతి శుశ్రుమాపం నవమి సఙ్కఏ వసేత్”
ఎంత సంఖ్య పెట్టి హెచ్చవేసిన మళ్ళీ కలిపితే అదే సంఖ్య వస్తుంది అది నవమికి ఉన్న గొప్పదనం. అలాగే రాముడు ఎటువంటి కష్టాలు ఎదురైన మారకుండా ధర్మాన్ని పట్టుకోవాలి కాబట్టి నవమి.

శ్రీ రామ నవమి మహిమ మరియు ప్రాముఖ్యత

శ్రీరామ నవమి హిందువులకు అత్యంత ముఖ్య మైన పండుగ. హిందువులు ఈ పండగను అత్యంత భక్తి శ్రద్దలతో ఈ పండగను జరుపుకుంటారు . శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు ఆంధ్రప్రదేశ్ లో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. రామా అనే రెండక్షరాల రమ్యమైన పదం పలుకని జిహ్వ-జిహ్వే కాదు.

శ్రీరామ నవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో, పల్లెపల్లెల్లోనూ రమణీయంగా జరుపుకోవడం ఓ సంప్రదాయం. భక్తుల గుండెల్లో కొలువై, సుందర సుమధుర చైతన్య రూపమై, కోట్లకొలది భక్తుల పూజలందుకొంటున్నాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడిని తెలుగువారు ప్రతి ఇంటా ఇంటి ఇలవేలుపుగా కొలుస్తారు. నేటికి భ్రధ్రాచలంలో శ్రీరాముడి పర్ణశాల భక్తులకు దర్శనమిస్తూవుంటుంది. భధ్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి లక్షలాది భక్తులు తరలి వస్తారు. కళ్యాణంలో పాల్గొని దానిని తిలకించి శ్రీరాముని దర్శించి ఆ దేవ దేవుడి ఆశీస్సులు పొందుతారు. శ్రీ రామ నవమి మహిమ మరియు ప్రాముఖ్యత సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం, సర్వ సంపదలకు నిలయం, సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం.

శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యముగల క్షేత్రం భద్రాచలం దివ్య క్షేత్రం. భద్రుడు అనగా రాముడు అని అచలుడు అంటే కొండ అని అందుకే రాముడు కొండపై నెలవై ఉన్న దివ్య ధామము కనుక ఈ క్షేత్రం భద్రాచలంగా ప్రసిద్ధిచెందిన పుణ్య క్షేత్రం. శ్రీరామచంద్రుడు తన వనవాస జీవితం ఇక్కడే గడపడమే ఈ పుణ్య క్షేత్రం యొక్క వైశిష్ట్యం. శ్రీరామ నామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలూ చెబుతున్నాయి. భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వము సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు జరిగినట్లుగా, అయితే తాను చెరసాలనుండి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు, కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు. శ్రీ సీతారామ కళ్యాణము, రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమినాడే. ఆ మరునాడు దశమి శ్రీరామ పట్ట్భాషేకం రామునికి జరిగింది. కోదండ రామకళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారంటా. శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా, నేత్ర పర్వంగా పట్ట్భాషేక సమయాన తిలకించి పులకితులవుతారట. ఆంజనేయుని పదభక్తికి మెచ్చి, హనుమ గుండెల్లో కొలువైన శ్రీరాముని భక్త పోషణ అనన్యమైనదై గ్రామగ్రామాన రామాలయం నెలకొని ఉన్నాయి. శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు, ఏకపత్నీ వ్రతుడు, పితృ, మాతృ, భాతృ, సదాచారం, నిగ్రహం, సర్వ సద్గుణాలు మూర్త్భీవించిన దయార్ద హృదయుడు.

శ్రీ రామనవమి రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేతముగా ఆరాధించి, వడ పప్పు, పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు. ప్రతియేడు భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణము చూసి తరించిన వారి జన్మ సార్థకం చెందుతందనేది భక్తుల విశ్వాసం.

Ashta Dasa Shakti Peetha Stotram

అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం ‌(Ashta dasa Shakti Peetha Stotram) లంకాయా శాంకరీ దేవీ కామాక్షీ కాంచికాపురే ప్రద్యుమ్నేశృంకలాదేవి చాముండి క్రౌంచపట్టనే అల్లంపురే జోగులాంబ శ్రీశైలే బ్రమరాంబికా కొల్హాపురే మహాలక్ష్మీ మాహుర్యే ఏకవీరికా ఉజ్జయిన్యాం మహాకాళి పీటిక్యాం పురుహూతికా ఓడ్యాణం గిరిజాదేవి...

Sri Mangala Gowri Vrata Vidhanam

మంగళగౌరీ వ్రత విధానం (Mangala Gowri Vrata Vidhanam) ఆచమనం ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా (అని మూడుసార్లు ఆచమనం చేయాలి) ఓం గోవిందాయ నమః (నీళ్ళు వదిలి వెయవలెను) విష్ణవే నమః మధుసూదనాయ...

Sri Venkatesa Karavalamba Stotram

శ్రీ వేంకటేశ కరావలంబ స్తోత్రం (Sri Venkatesa Karavalamba Stotram) శ్రీ శేషశైల సునికేతన దివ్య మూర్తే నారాయణాచ్యుతహరే నళినాయతాక్ష! లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబం!! బ్రహ్మాది వందిత పదాంబుజ శంఖపాణే శ్రీమత్సుదర్శన సుశోభిత...

Shiva Pratah Smarana Stotram

శివ ప్రాతః స్మరణం (Shiva Pratah Smarana Stotram) ప్రాతః స్మరామి భవభీతిహరం సురేశం గంగాధరం వృషభవాహన మంబికేశం  || 1 || ఖట్వాంగ శూల వరదాభయ హ సమీశం సంసార రోగహరమౌషధమద్వితీయం || 2 || ప్రాతర్నమామి గిరీశం గిరిజార్ధ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!