Home » Stotras » Pragna Vivardhana Sri Karthikeya Stotram
Pragna-Vivardhana-Sri-Karthikeya-Stotram

Pragna Vivardhana Sri Karthikeya Stotram

ప్రజ్ఞావివర్ధన శ్రీ కార్తికేయ స్తోత్రం (Pragna Vivardhana Sri Karthikeya Stotram)

స్కంద ఉవాచ

యోగీశ్వరో మహాసేనః కార్తికేయోಽగ్నినన్దనః |
స్కందః కుమారః సేనానీః స్వామీ శఙ్కరసమ్భవః || 1 ||

గాంగేయస్తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః |
తారకారిః ఉమాపుత్రః క్రౌంచారిశ్చ షడాననః || 2 ||

శబ్దబ్రహ్మసముద్రశ్చ సిద్ధః సారస్వతో గుహః |
సనత్కుమారో భగవాన్ భోగమోక్షఫలప్రదః || 3 ||

శరజన్మా గణాధీశః పూర్వజో ముక్తిమార్గకృత్ |
సర్వాగమప్రణేతా చ వాంఛితార్థప్రదర్శనః || 4 ||

అష్టావింశతినామాని మదీయానీతి యః పఠేత్ |
ప్రత్యూషే శ్రద్ధయా యుక్తో వాచస్పతిర్భవేత్ || 5 ||

మహామన్త్ర మయానీతి మమ నామానుకీర్తనమ్ |
మహాప్రజ్ఞామవాప్నోతి నాత్ర కారా విచారణా || 6 ||

ఇతి శ్రీ రుద్రయమలే ప్రజ్ఞా వివర్ధన శ్రీకార్తికేయస్తోత్రం సంపూర్ణం

కార్తికేయుని 28 నామములు 

  1. యోగీశ్వరః – యోగీశ్వరులకు అధిపతి
  2. మహాసేనః – దేవసైన్యానికి అధిపతి, దేవసేనాపతి
  3. కార్తికేయః – ఆరు కృత్తికా నక్షత్రములచే పోషింపబడిన వాడు
  4. అగ్నినన్దనః – పరమశివుని జ్ఞానాగ్ని నుంచి ఉద్భవించినవాడు మరియు పరమశివుని తేజస్సు కొంత సేపు భరించినందువల్ల, అగ్ని దేవునికి కూడా తనయుడిగా పిలువబడినవాడు.
  5. స్కందః – పరమశివుని తేజస్సు నుండి జన్మించినవాడు
  6. కుమారః – కుమార అన్న నామం కేవలం సుబ్రహ్మణ్యునికే చెందినది. ఎందుకంటే, జగత్తుకి మాతా పితలు అయిన పార్వతీ పరమేశ్వరుల అన్యోన్యతకి ఫలం మన బుజ్జి సుబ్రహ్మణ్యుడు.
  7. సేనానీః – దేవసేనలకు అధిపతి, దేవసేనాధ్యుక్షుడు.
  8. స్వామీ శంకరసంభవః – శంకరుని దివ్యమైన తేజస్సు నుండి పుట్టినవాడు.
  9. గాంగేయః – పరమశివుని తేజస్సు అగ్నిదేవుడు భరించలేక, గంగా మాతకి ఇచ్చేస్తే, గంగా మాత కొంత సేపు శివుని తేజస్సును భరిస్తుంది. అందువల్ల, గంగా మాతకి కూడా పుత్రునిగా పిలబడ్డవాడు కాబట్టి గాంగేయ అనే నామం వచ్చింది.
  10. తామ్రచూడః – కుక్కుటమును అధిరోహించిన వాడు.
  11. బ్రహ్మచారీ – ఎల్లప్పుడూ బ్రహ్మనందు రమించువాడు.
  12. శిఖిధ్వజః – అగ్ని ధ్వజముగా కలవాడు
  13. తారకారిః – తారకాసురడనే రాక్షస సంహారము చేయుటకు అవతారం దాల్చిన వాడు, తారకాసురుడిని, ఇతర రాక్షస గణములను సంహరించి దేవతలను రక్షించినవాడు.
  14. ఉమాపుత్రః – ఉమాదేవి, అంటే పార్వతీ అమ్మ వారి ముద్దుల తనయుడు. అందుకే సుబ్రహ్మణ్య స్వామి వారు అచ్చం అమ్మవారి లానే ఉంటారు.
  15. క్రౌంచారిః – పర్వత రూపములో ఉన్న క్రౌంచ అనే రాక్షసుడిని సంహరించినవాడు.
  16. షడాననః – ఆరు ముఖములు గలవాడు.
  17. శబ్దబ్రహ్మసముద్రః – జ్ఞాన స్వరూపుడు, అంటే వేదములు ఏ పరబ్రహ్మ స్వరూపమును గురించి ఘోషిస్తున్నాయో, ఆ వేద శబ్దములచే ప్రతిపాదించబడిన వాడు.
  18. సిద్ధః – పరిపూర్ణ సిద్ధ స్వరూపుడు
  19. సారస్వతః – సరస్వతీ స్వరూపము, అంటే జ్ఞాన స్వరూపము.
  20. గుహః – సకలజీవుల హృదయ గుహలో కొలువై ఉన్నవాడు.
  21. భగవాన్ సనత్కుమారః – చతుర్ముఖ బ్రహ్మ గారి నలుగురు మానస పుత్రులలో ఒకరైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారు. ఈ విషయమే, త్రిపురా రహస్యంలో మాహాత్మ్యఖండంలో వివరించబడినదని, శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నిర్ధారించారు.
  22. భోగమోక్షఫలప్రదః – ఈ భూమి మీద మనం సుఖంగా జీవించడానికి అవసరమైన సంపదతో పాటు అంత్యమునందు మోక్షమును కూడా ఇవ్వగలిగినవాడు.
  23. శరజన్మా – శరవణతటాకము (రెల్లు పొదల) నుండి జన్మించినవాడు.
  24. గణాధీశః – సకల దేవతలకు, గణములకు అధిపతి అయిన వాడు.
  25. పూర్వజః – అందరికన్నా ముందున్నవాడు, అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు, కేవలం ఒక అవతారం మాత్రమే కాదు, ఎప్పుడూ ఉండే పరబ్రహ్మ స్వరూపం. ఆయన ఎప్పుడూ ఉన్నవాడు, పుట్టుక లేనివాడు.
  26. ముక్తిమార్గకృత్ – ముక్తి మార్గమును బోధించే గురు స్వరూపం. అంత్యమున ముక్తిని ప్రసాదించి, తనలో కలుపుకునే స్వామి.
  27. సర్వాగమప్రణేతా – సకల ఆగమములకు మూలము.
  28. వాంచితార్ధప్రదర్శనః – అభీష్టములను నెరవేర్చే తండ్రి.

ఈ ప్రజ్ఞావివర్ధన కార్తికేయ స్తోత్రము రుద్రయమల తంత్రములోనిది. ఎవరైతే ఈ 28 నామములు ప్రతీ దినం ప్రాతః కాలం భక్తి శ్రద్ధలతో చదువుతారో, వారు సరస్వతీ అనుగ్రహం పొంది, చక్కని తెలివితేటలు, మంచి వాక్కు మరియు జ్ఞానమును పొందుతారు.

Sri Ganesha Dwadasa nama Stotram

శ్రీ గణేశ ద్వాదశనామ స్తోత్రం (Sri Ganesha Dwadasa nama Stotram) శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ | ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయేః || 1 || అభీప్సితార్థ సిధ్యర్థం పూజితో యః సురాసురైః | సర్వవిఘ్నహరస్తస్మై గణాధిపతయే నమః || 2 ||...

Mruthasanjeevana Kavacham

మృతసంజీవన కవచం (Mruthasanjeevana Kavacham) ఏవమారాధ్య గౌరీశం దేవం మృత్యుంజయేశ్వరమ్ మృతసంజీవనం నామ్నా కవచం ప్రజపేత్సదా సారాత్సారతరం పుణ్యం గుహ్యాద్గుహ్యతరం శుభమ్ మహాదేవస్య కవచం మృతసంజీవనామకం సమాహితమనా భూత్వా శృణుష్వ కవచం శుభమ్ శృత్వైతద్దివ్య కవచం రహస్యం కురు సర్వదా వరాభయకరో...

Sri Bhuvaneshwari Mahavidya

భువనేశ్వరీ మహావిద్య ( Sri Bhuvaneshwari Mahavidya) Bhuvaneshvari Jayanti is celebrated on the Badarapada Masam Shukla Paksha Dwadashi day(12th day) as per Chandra Manam. శ్రీ భువనేశ్వరీదేవి. ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి...

Sri Tripurasundari Ashtakam Stotram

శ్రీ త్రిపురసుందరి అష్టకం (Sri Tripurasundari Ashtakam) కదంబవనచారిణీం మునికదంబకాదంబినీం నితంబజితభూధరాం సురనితంబినీసేవితామ్ నవాంబురుహలోచనామభినవాంబుదశ్యామలాం త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే || ౧ || కదంబవనవాసినీం కనకవల్లకీధారిణీం మహార్హమణిహారిణీం ముఖసముల్లసద్వారుణీమ్ దయావిభవకారిణీం విశదరోచనాచారిణీం త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే || ౨ || కదంబవనశాలయా కుచభరోల్లసన్మాలయా కుచోపమితశైలయా...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!