శ్రీ షిరిడి సాయి నక్షత్ర మాలిక స్తోత్రం

1)షిర్డీ సదనా శ్రీ సాయీ
సుందర వదన శుభదాయీ
జగథ్కరన జయ సాయీ
నిస్మరనె ఎంతో హాయి
2)శిరమున వస్త్రం చుట్టితివీ
చినిగిన కఫిని తొడిగితివీ
ఫకీరువలే కనిపించితివీ
పరమాత్ముడ వనిపించితివీ
3)చాంధుపటెలుని పిలిచితివీ
అశ్వము జాడ తెలిపితివీ
మాహాల్సా భక్తి కి మురిసితివీ
సాయని పిలిచితే పళికితివీ
4)గోధుమ పిండిని విసిరీతివీ
కలరా వ్యాధిని తరిమితివీ
తుపాను తాకిడి నపితివీ
అపాయమును తప్పించితివీ
5) అయిదిళ్లలో బిక్షం అడిగితివీ
పాపలను పరిమార్చితివీ
బైజా సేవను మెచతివీ
సాయుజ్యమును  ఇచ్చితివీ
6. నీళ ను నూనె గా మార్చితివీ
దీపాలను వెలిగించితివీ
సూకర నైజం తెలిపితివీ
నిందలు వేయుట మాన్పితివీ
7 ఊదీ వైధ్యము చేసితివీ
వ్యాధులానెన్నో బాపితివీ
సంకీర్తన చేయించితివీ
చిత్త శాంతి చేకూర్చితివీ
8. అల్లా నామం పలికితివీ
ఎల్లరి క్షేమము కోరితివీ
చంధనోత్సవం చేసితివీ
మతద్వెషాలను మపితివీ
9. కుష్టురోగిని గాంచితివీ
ఆశ్రయం ఇచ్చి సాకితివీ
మానవ ధర్మం నెరపితివీ
మహాత్మునిగ విలసిల్లితివీ
10 ధునిలో చేతిని పెట్టితివీ
కమ్మరి బిడ్డను కాచితివీ
శ్యామామోర నాలకించితివీ
పాము విషము తొలగించితివీ
11.జానెడు బల్లను ఎక్కితివీ
చిత్రం గా శయనించితివీ
బల్లి రాకను తెలిపితివీ
సర్వాజ్న్డవని పించితివీ
12. లెండీ వనమును పెంచితివీ
ఆహ్లాదమును పంచితివీ
కర్తవ్యము నెరిగించితివీ
సోమరితనమును తరిమితివీ
13.కుక్కను కొడితే నోచ్చితివీ
నేపై దెబ్బలు చూపితివీ
ప్రేమతత్వమును చాటితివీ
దయమయుడవని పించితివీ
14. అందరిలోనూ ఒదిగితివీ
ఆకాశానికి ఎదిగితివీ
దుష్ట జనాళిని మార్చితివీ
శిష్టకోటిలో చేర్చితివీ
15. మాహాల్సా ఒడిలో కొరిగితివీ
ప్రాణాలను విడనాడితివీ
మూడు దినములకు లేచితివీ
మృతయుంజయుడని పించి తివీ
16. కాళ్ళకు గజ్జేలు కత్తితివీ
లయబద్దముగా ఆడితివీ
మధుర గళం తో పాడితివీ
మహాదానందము కూర్చితివీ
17.అహంకారమును తెగడితివీ
నానవళినీ పొగడితివీ
మానవసేవా చేసితివీ
మహనీయుడవని పించితివీ
18. దామూ భక్తికి మెచ్చితివీ
సంతానమును ఇచ్చితివీ
దాసగనుని కరుణించితివీ
గంగాయమునలు చూపితివీ
19. పరి ప్రశ్నను వివరించితివీ
నానా హృది కదిలించితివీ
దీక్షితుని పరీక్షించితివీ
గురు భక్తిని ఇలా చాటితివీ
20. చేతిని తెడ్దుగా త్రిప్పితివీ
కమ్మని వంటలు చేసితివీ
ఆర్తజనాళిని పిలిచిటీవి
ఆకలి బాధను తీర్చితివీ
21. మతమును మార్చితే కసిరీతివీ
మతమే తండ్రణి తెలిపితివీ
సకల భూతదయ చూపితివీ
సాయీ మాతగా అలరితివీ
22. హేమాధును దీవించితివీ
నీదు చరిత వ్రాయించితివీ
పారాయణము చేయించితివీ
పరితాపము నెడబపితివీ
23. లక్ష్మిభాయిని పిలిచితివీ
తొమ్మిది నానెముళిచ్చితివీ
నవవిధ భక్తిని తెలిపితివీ
ముక్తికి మార్గము చూపితివీ
24. భూటి కలలో కొచ్చితివీ
ఆలయమును కట్టించితివీ
తాత్యాప్రాణము నిలిపితివీ
మహాసమాధి చెందితివీ
25. సమాధి నుండే పళికితివీ
హారతిఇమ్మని అడిగితివీ
మురళీధారునిగానిలచితివి
కరుణామృతామును చిలికితివి
26. చెప్పిన దేధో చేసితివీ
చేసినదేదో చెప్పితివీ
దాసకోటి మది దోచితీవి
దశదిశలా బాసిల్లితివీ
27. సకల దేవతలునీవెనయా
సకల శుభములను కూర్చుమయా
సతతము నిను ధ్యానింతు మయా
సద్గురు మా హృద నిలువుమయా

సాయి నక్షత్ర మాలికా భవరోగాలకు మూలికా పారాయణ కిది తేలిక ఫలమిచూటలో ఏలిక

సాయిరామ సాయిరామ రామ రామ సాయిరామ
సాయికృష్ణ సాయికృష్ణ కృష్ణ కృష్ణ సాయికృష్ణ

Related Posts

One Response

Leave a Reply to Swarna Cancel Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.