చిత్త స్థిర స్త్రోత్రo (Shri ChittaStheeryakam Stotra)

అనసూయాత్రి సంభూత దత్తాత్రేయ మహామతే |
సర్వదేవాధి దేవత్వం మమ చితం స్థిరీకురు || 1 ||

భావము: అత్రి అనసూయల దీపకుడిగా ఉద్భవించిన వాడు సర్వ దేవతలలో నిండిన దైవత్వంను, బుద్దిమంతుడు అయిన శ్రీ దత్తాత్రేయస్వామి. నా మనస్సు నీ మీద స్థిరముగా నిలుపు

శరణాగత దీనార్త తరకాఖిల కారక |
సర్వ చాలక దేవత్వం మమ చిత్తం స్టిరీకురు || 2 ||

భావము : శరణాగతి చెందిన వారికీ,దీనులకు జ్ఞానం ప్రసాదించే వాడు,అందరినీ స్వయం సమృద్ధిగా ఉద్ధరించే వాడు అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి. నా మనస్సు నీ మీద స్థిరముగా నిలుపు.

సర్వ మంగళ మాంగల్య సర్వాధి వ్యాధి భేషజ |
సర్వసంకట హరీన్ త్వం మమ చితం స్థిరీకురు || 3 ||

భావము : అన్ని శుభములకుమంగళ కారివై అన్ని వ్యాధులకు ఔషధం నీవై,అన్ని కష్టములను తొలగించు అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి నా మనస్సు నీ మీద స్థిరముగా నిలుపు.

స్మర్తృగామి స్వ భక్తానాం కామదో రిపు నాశనః |
భుక్తి ముక్తి ప్రద: సత్వం మమ చితం స్థిరీకురు || 4 ||

భావము తన భక్తులు పిలవగానే ప్రత్యక్షమై కామ,క్రోధ,లోభ,మోహం లనే శత్రువులను నాశనం చేసి ఇహ,పర శ్రేయస్సులను సత్వరం మే తీర్చే శ్రీ దత్తాత్రేయ స్వామి..నా మనస్సు నీ మీద స్థిరముగా నిలుపు.

సర్వ పాప క్షయ కర స్తాపదైన్య :నివారణం |
యో భీష్టదః :ప్రభు :సత్వం మమ చితం స్థిరీకురు || 5 ||

భావము అన్ని పాపములు నశింప జేసి,అధ్యామిక,అది బౌతిక,దైవిక తాపాలు నివారించి త్వరగా అభీష్టములు ప్రసాదించు శ్రీ దత్తాత్రేయ స్వామి. నా మనస్సు నీ మీద స్థిరముగా నిలుపు.

య ఏత త్ర్ప్ యతః శ్లోక పంచకం ప్రపటేత్సుదీ:
స్థిర చిత్త స్స భగవాన్ కృపా పాత్రం భవిష్యతి. || 6 ||

భావము శ్రీవాసుదేవానంద సరస్వతి స్వామి విరచిత ఈ పంచకం శ్లోకాలు ఎవరు భక్తితో పఠిస్తారో వారికి భగవాన్ శ్రీ దత్తాత్రేయ అనుగ్రహంతో పాటు స్థిర మైన చిత్తము స్వామి వారిపై కలుగుతుంది.శ్రీ దత్తాత్రేయ స్వామికి అంకితం.

ఈ ఐదు శ్లోకాలు నిత్యము పఠిస్తే దత్తాత్రేయుల వారి అనుగ్రహం తప్పక లభిస్తుంది.

Related Posts

One Response

  1. Y SUNITHA

    Sairam,
    Stotram with meaning is very improvised way of reaching god easily as when we know the meaning we will be connected to god with whole heartedness. Please continue to post stotrams with meaning for the earlier posts also, if possible. Let us raise our hands to safeguard our rich heritage of Hindu culture to reach our next gens allowing them to know the greatness of praising lord by chanting stotrams. Sairam

    Reply

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!