Home » Stotras » Sri Chidambareswara Stotram

Sri Chidambareswara Stotram

శ్రీ చిదంబరేశ్వర స్తోత్రం (Sri Chidambareswara Stotram)

కృపాసముద్రం సుముఖం త్రినేత్రం జటాధరం పార్వతీవామభాగమ్ |
సదాశివం రుద్రమనంతరూపం చిదంబరేశం హృది భావయామి || 1 ||

వాచామతీతం ఫణిభూషణాంగం గణేశతాతం ధనదస్య మిత్రమ్ |
కందర్పనాశం కమలోత్పలాక్షం చిదంబరేశం హృది భావయామి || 2 ||

రమేశవంద్యం రజతాద్రినాథం శ్రీవామదేవం భవదుఃఖనాశమ్ |
రక్షాకరం రాక్షసపీడితానాం చిదంబరేశం హృది భావయామి || 3 ||

దేవాదిదేవం జగదేకనాథం దేవేశవంద్యం శశిఖండచూడమ్ |
గౌరీసమేతం కృతవిఘ్నదక్షం చిదంబరేశం హృది భావయామి || 4 ||

వేదాంతవేద్యం సురవైరివిఘ్నం శుభప్రదం భక్తిమదంతరాణామ్ |
కాలాంతకం శ్రీకరుణాకటాక్షం చిదంబరేశం హృది భావయామి || 5 ||

హేమాద్రిచాపం త్రిగుణాత్మభావం గుహాత్మజం వ్యాఘ్రపురీశమాద్యమ్ |
శ్మశానవాసం వృషవాహనస్థం చిదంబరేశం హృది భావయామి || 6 ||

ఆద్యంతశూన్యం త్రిపురారిమీశం నందీశముఖ్యస్తుతవైభవాఢ్యమ్ |
సమస్తదేవైః పరిపూజితాంఘ్రిం చిదంబరేశం హృది భావయామి || 7 ||

తమేవ భాంతం హ్యనుభాతిసర్వమనేకరూపం పరమార్థమేకమ్ |
పినాకపాణిం భవనాశహేతుం చిదంబరేశం హృది భావయామి || 8 ||

విశ్వేశ్వరం నిత్యమనంతమాద్యం త్రిలోచనం చంద్రకలావతంసమ్ |
పతిం పశూనాం హృది సన్నివిష్టం చిదంబరేశం హృది భావయామి || 9 ||

విశ్వాధికం విష్ణుముఖైరుపాస్యం త్రిలోచనం పంచముఖం ప్రసన్నం |
ఉమాపతిం పాపహరం ప్రశాంతం చిదంబరేశం హృది భావయామి || 10 ||

కర్పూరగాత్రం కమనీయనేత్రం కంసారిమిత్రం కమలేందువక్త్రమ్ |
కందర్పగాత్రం కమలేశమిత్రం చిదంబరేశం హృది భావయామి || 11 ||

విశాలనేత్రం పరిపూర్ణగాత్రం గౌరీకలత్రం హరిదంబరేశమ్ |
కుబేరమిత్రం జగతః పవిత్రం చిదంబరేశం హృది భావయామి || 12 ||

కళ్యాణమూర్తిం కనకాద్రిచాపం కాంతాసమాక్రాంతనిజర్ధదేహమ్ |
కపర్దినం కామరిపుం పురారిం చిదంబరేశం హృది భావయామి || 13 ||

కల్పాంతకాలాహితచండనృత్తం సమస్తవేదాంతవచోనిగూఢమ్ |
అయుగ్మనేత్రం గిరిజాసహాయం చిదంబరేశం హృది భావయామి || 14 ||

దిగంబరం శంఖసితాల్పహాసం కపాలినం శూలినమప్రయేమ్ |
నాగాత్మజావక్త్రపయోజసూర్యం చిదంబరేశం హృది భావయామి || 15 ||

సదాశివం సత్పురుషైరనేకైః సదార్చితం సామశిరస్సుగీతమ్ |
వైయ్యాఘ్రచర్మాంబరముగ్రమీశం చిదంబరేశం హృది భావయామి || 16 ||

చిదంబరస్య స్తవనం పఠేద్యః ప్రదోషకాలేషు పుమాన్ స ధన్యః |
భోగానశేషాననుభూయ భూయః సాయుజ్యమప్యేతి చిదంబరస్య || 17 ||

ఇతి శ్రీ చిదంబరేశ్వర స్తోత్రం సంపూర్ణమ్

Sri Kali Mahavidya

శ్రీ కాళీదేవి  (Sri Kali Mahavidya) Mata kali Jayanti is celebrated on the Ashweeja Masa shukla Paksha Saptami night (Durga Ashtam during Navarati) also known as kaalratri as per Chandra Manam. శ్రీ కాళీదేవి...

Sri Chandrasekhara Ashtakam

శ్రీ చంద్రశేఖర అష్టకం (Sri Chandrasekhara Ashtakam) చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ | చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ || రత్నసాను శరాసనం రజతాద్రి శృంగ నికేతనం శింజినీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకమ్ | క్షిప్రదగ్ద పురత్రయం త్రిదశాలయై రభివందితం...

Runa Vimochaka Angaraka Stotram

ఋణవిమోచక అంగారక స్తోత్రం (Runa Vimochaka Angaraka Stotram) స్కంద ఉవాచ ఋణగ్రస్తరానాంతు ఋణముక్థిః  కధం భవేత్ బ్రహ్మఉవాచః వక్ష్యేహం సర్వలోకానాం హితార్ధం హితకామదం శ్రీమత్ అంగారక స్తోత్రమహామంత్రస్య గౌతమ ఋషి అనుష్టుప్ చందః అంగారకో దేవతా మమ ఋణవిమోచనార్దే జపే...

Abhilasha Ashtakam (Atma Veereshwara Stotram)

అభిలాషాష్టకము (ఆత్మావీరేశ్వర స్తోత్రం) (Abhilasha Ashtakam / Atmaveereshwara Stotram) ఏకం బ్రహ్మైవాద్వితీయం సమస్తం సత్యం సత్యం నేహ నానాస్తి కించిత్! ఏకోరుద్రో నద్వితీయోవతస్థే తస్మాదేకం త్వాం ప్రపద్యే మహేశం || 1 || ఏకః కర్తా త్వం హి సర్వస్య...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!