Home » Sri Narasimha Swamy » Sri Narasimha Shodasa Ratna Malika Stotram

Sri Narasimha Shodasa Ratna Malika Stotram

శ్రీ నరసింహ షోడశరత్నమాలికా స్తోత్రం (Sri Narasimha Shodasa Ratna Malika Stotram)

నమస్తే నారసింహభగవన్ జ్వాలామాలాస్వరూపిణే
ప్రహ్లాదాహ్లాదవరదాయ నారదవందితాంఘ్రియుగళే ||1||

నమస్తే నారసింహభగవన్ శంఖచక్రధారిణే
యోగానందస్వరూపాయ యోగమార్గప్రదర్శినే ||2||

నమస్తే నారసింహభగవన్ నిఠలాక్షస్వరూపిణే
అరిషడ్వర్గహంతాయ మహాబలస్వరూపిణే ||3||

నమస్తే నారసింహభగవన్ అహోబలనివాసినే
కుంకుమచందనాంకితాయ వేదవేదాంగరూపిణే ||4||

నమస్తే నారసింహభగవన్ ఘటికాచలనివాసినే
దంష్ట్రాయుధాయ భద్రాయ పంచాననస్వరూపిణే ||5||

నమస్తే నారసింహభగవన్ వేదాచలనివాసినే
వనమాలాధరాయ శాంతాయ మంత్రరాజైకరూపిణే ||6||

నమస్తే నారసింహభగవన్ సర్వయంత్రవిదారిణే
సర్వతంత్రస్వరూపాయ భక్తానందకారిణే ||7||

నమస్తే నారసింహభగవన్ చండవిక్రమరూపిణే
గరుడారూఢాయ దేవాయ పరమహంసస్వరూపిణే ||8||

నమస్తే నారసింహభగవన్ కమలకోమలచరణే
ప్రణతజనవత్సలాయ లక్ష్మీమానసవిహారిణే ||9||

నమస్తే నారసింహభగవన్ బంధమోచనకారిణే
వాంచితార్ధప్రదాతాయ పాపసంఘవిదారిణే ||10||

నమస్తే నారసింహభగవన్ దారుణరోగనివారిణే
వారిజభవపూజితాయ విశ్వస్థితికారిణే ||11||

నమస్తే నారసింహభగవన్ మకరకుండలధారిణే
నక్షత్రగ్రహాధీశాయ స్తంభావిర్భావరూపిణే ||12||

నమస్తే నారసింహభగవన్ షోడశకళాస్వరూపిణే
ధ్యానమగ్నాయ సతతం ఆగళాద్రుద్రరూపిణే ||13||

నమస్తే నారసింహభగవన్ సర్వోపద్రవవారిణే
జ్ఞానాంజనస్వరూపాయ నాదబ్రహ్మస్వరూపిణే ||14||

నమస్తే నారసింహభగవన్ గుణాతీతస్వరూపిణే
త్రిభువనైకపాలకాయ శంకరఃప్రాణరక్షిణే ||15||

నమస్తే నారసింహభగవన్ జటాజూటధారిణే
భార్గవపవనాత్మజసన్నుతాయ శింశుమారస్వరూపిణే ||16||

సర్వం శ్రీ నారసింహ దివ్య చరణారవిందార్పణమస్తు

Sri Lakshmi Narasimha Swamy Temple, Mattapalli

శ్రీ మట్టపల్లి లక్ష్మీనృసింహ స్వామి ( Sri Lakshmi Narasimha Swamy Temple, Mattapalli) పదకొండు వందల సంవత్సరాల క్రితం మట్టపల్లికి ఎదురుగా కృష్ణానదికి అవతల ఒడ్డున తంగెడ అనే గ్రామం వుండేది. ఆ ఊరిలో మాచిరెడ్డి అనే మోతుబరి రైతు...

Sri Ahobila Narasimha Stotram

శ్రీ అహోబిల నారసింహ స్తోత్రం (Sri Ahobila Narasimha Stotram) లక్ష్మీకటాక్షసరసీరుహరాజహంసం పక్షీంద్రశైలభవనం భవనాశమీశం గోక్షీరసార ఘనసార పటీరవర్ణం వందే కృపానిధిం అహోబలనారసింహం || 1 || ఆద్యంతశూన్యమజమవ్యయ మప్రమేయం ఆదిత్యచంద్రశిఖిలోచన మాదిదేవం అబ్జాముఖాబ్జ మదలోలుప మత్తభ్రుంగం వందే కృపానిధిం అహోబలనారసింహం...

Sri Narasimha Ashtakam

శ్రీ నృసింహాష్టకమ్  (Sri Narasimha Ashtakam) శ్రీమదకలఙ్క పరిపూర్ణ! శశికోటి-  శ్రీధర! మనోహర! సటాపటల కాన్త!। పాలయ కృపాలయ! భవాంబుధి-నిమగ్నం దైత్యవరకాల! నరసింహ! నరసింహ! ॥ 1॥ పాదకమలావనత పాతకి-జనానాం పాతకదవానల! పతత్రివర-కేతో!। భావన! పరాయణ! భవార్తిహరయా మాం పాహి కృపయైవ...

Sri Nrusimha Dwadasa Nama Stotram

శ్రీ నృసింహ ద్వాదశ నామ స్తోత్రం (Sri Nrusimha Dwadasa Nama Stotram) ఓం అస్య శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్ర మహామంత్రస్య వేదవ్యాసో భగవాన్‌ ఋషిః అనుష్టుప్‌ఛ్ఛందః లక్ష్మీనృసింహోదేవతా, శ్రీనృసింహ ప్రీత్యర్థే జపే వినియోగః ధ్యానమ్ స్వభక్త పక్షపాతేన తద్విపక్ష...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!